చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాధితులందరి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు."రాష్ట్రంలో కరెంట్ షాక్ ఘటనలు చాలా జరుగుతున్నాయి. అధికారులంతా ఈ అంశంపై దృష్టిసారించాలి. నిత్యం నివేదికలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చనిపోయిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం మా ప్రభుత్వ విధానం కాదు. బాధిత కుటుంబాలందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాం" అని రవి కుమార్ అన్నారు.