జాతీయ రహదారిలో పెద్దబమ్మిడి దాబా వద్ద గురువారం రాత్రి లారీ క్యాబెన్ పై నుంచి జారీ పడి గంజాం జిల్లా బూమకుంప మండలం అతిగూడ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మున్న సంబాల్ (35) మృతి చెందాడు. రాజమండ్రి నుంచి కటక్ వెళ్తూ విశ్రాంతి కోసం గురువారం రాత్రి దాబా వద్ద అపగా క్లీనర్ గాలికోసం లారీపై నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో కేబిన్ పై నుంచి కిందకు జారిపడి మృతి చెందాడు. తెల్లవారి డ్రైవర్ లేచి చూడగా క్లీనర్ మున్న విగతిజీవిగా పడి ఉండడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మమ్మద్ అలీ కేసు నమోదు చేసి, పోస్టుమార్టంకోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.