ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా ఫిట్నెస్ లేని బస్సులు, టాటాఏసీ, టాటాసుమోలలో విద్యార్థులకు తరలిస్తున్న రోడ్డు పై వెలుతున్న వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న జీనియస్ గ్లోబుల్స్కూల్ యాజమాన్యం పై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ నివారం గోనెగండ్లలోని ఎమ్మిగనూరు, కర్నూలు ప్రధాన రహదారిపై అరగంట రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద అనం తరం స్కూల్లోకి వెళ్లిన విద్యార్ధి సంఘాల నాయకులు యాజమాన్యా నికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. అనంతరం సంఘం నాయ కులు మట్లాడుతూ శనివారం ఉదయం గంజహళ్లి గ్రామానికి చెందిన విద్యార్థులకు కోసం వెలుతున్న జీనియస్ గ్లోబుల్ స్కూల్ బస్సు రోడ్డు పై దరగయ్య అనే వ్యక్తి ని డీ కొన్ని ఆయన మృతి కి కారణం అయ్యారని వారన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి పరిహారం కింద రూ. 25 లక్షలు స్కూల్ యాజమాన్యం చెల్లించాలని డిమాండ్
గోనెగండ్ల ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహిస్తున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు చేశారు. ఈ స్కూల్లో పలు సమస్యలు ఉన్నప్పటికి విద్యాశాఖ అధికా రులు పట్టించుకోవాడం లేదని ఇప్పటికై అధికారులు చర్యలు తీసుకో వాలని లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మునిస్వామి, ఏబీవీపీ భరత్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎర్రిస్వామి. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిసంఘం మద్దిలేటి, శేఖర్, ఎన్ఎస్ఈయూఐ వీరేష్యాదవ్, సరసన్న, పీడీఎస్యూ మహేంద్రబాబు, రాజేష్, యూఎస్ఎఫ్ఎస్ఐ ఉదయ్, ఏపీఎస్ఎప్ ఉసేన్, డీఎస్వీఎఫ్ వెంకటేష్, వైఎస్ఆర్ఎస్ఈయ్యూ సోమశేఖర్, షరీప్, నాగరాజు, రవితేజ, రాముడు, జుబేరు పాల్గొన్నారు.