ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్న ఉప ముఖ్యమంత్రిఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు .ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చు.ఈ పథకానికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని ఆదేశించారు.జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనుల అమలులో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్. & ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.