కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే. ఐటీ రంగంలో ఈనాడు మనదేశం అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ కృషి ఫలితమే. సాంకేతిక పరిశ్రమపై పన్నులను తగ్గించే సంస్కరణలను ప్రవేశపెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు. ఆయన అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.