ఎస్జీటీ పేపర్ లీక్ అయ్యిందంటున్న అభ్యర్థులు గత నెలలో డీఎస్సీ కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు.. అదే పోస్టు భర్తీకి మరోరోజు నిర్వహించిన పరీక్షలో పునరావృతం కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 18 ప్రశ్నలు పునరావృతం అయ్యాయి. నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే ఐదోరోజూ రిపీట్ అయ్యాయి.విచిత్రమేమంటే ప్రశ్న నంబర్ కూడా మారలేదు.. ఆప్షన్లు సైతం ఒకే రకంగా వచ్చాయి.దీంతో కొందరు అధికారుల పాత్రపైనా అనుమానాలు వస్తున్నాయని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని, డీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు.