వైకాపాతో అంటకాగి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యా దులు ఎదుర్కొంటున్న సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్కు మార్రెడ్డిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ పూర్తి చేసిoధీ. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి గత అయిదే ళ్లలో ఆయన పలు అవకతవకలకు పాల్పడ్డారని, నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి అవలంబించడం, వైకాపా సామాజిక మాధ్యమ విభాగాల్లో పనిచేసే వారికి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లిం చటం, నిధుల దారి మళ్లింపు తదితర అంశాలపై నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. విజయ్ కుమార్రెడ్డితో పాటు మరికొందరు అధికారుల ప్రమేయంపైనా నివేదికలో వివరాలు పొందుపరచడం గమనార్హం