పంచాయతీలకు నిధులు లేని కారణంగా గత వైసీపీ హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని పాలకొండ మండల అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మంగళవారం అన్నారు. 2014-19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం తడి చెత్త పొడి చెత్త నుంచి వర్మి కంపోస్టు సేంద్రియ ఎరువు తయారిని ప్రోత్సహించిందని అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వీటిని పునః ప్రారంభించేందుకు కూటమి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు.