భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించిన నవ నాయకుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకే కాక దేశానికి ఒక గొప్ప సంపదగా మిగిలిపోయారని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వర రావు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం డిసిసి కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.