కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమా మహేశ్వర రావు, చౌదరి లక్ష్మణరావులు అభినందించారు.
మంగళవారం శ్రీకాకుళంలో వారు కేంద్ర మంత్రిని కలిసి సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ విమానాశ్రయం అని దీని ఏర్పాటుకు కేంద్ర మంత్రి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు.