శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా మారుద్దామని, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్దామని, నగరమంతా కాలుష్యంతో నిండిపోయిందని, శ్రీకాకుళం గ్రీన్ సిటీగా మార్చే బాధ్యతను తీసుకుందామని దిశ ఎస్ఐ మొజ్జాడ. ప్రవళ్లిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి వ్యవస్థాపకులు శిల్లా. రమేష్ ద్వారా 25 వేల ఉచిత వృక్షజాతి మొక్కల పంపిణి కార్యక్రమం నేటి నుండి ప్రారంభమౌతాయన్నారు.