రాజీవ్ ప్రభుత్వం 1986లో ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్‌ను ప్రవేశపెట్టి, 1987లో దానిని ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన సంస్థాగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
వంద మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులకు జీతం ఇవ్వాలనే నిబంధనను ఇందులో చేర్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని 1985లో రాజీవ్ సర్కారు ఏర్పాటు చేసింది.