శ్రీకాకుళం డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం హాస్టళ్లు, మెస్ లను, వంటశాలలను వైస్ -ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను, మెస్ లలో వసతులు, మంచి నీటి సౌకర్యం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి వీసీ భోజనం చేశారు. బయిట నుంచి ఎటువంటి ఫుడ్ పార్సిల్ లు గాని, పానీయాలుగాని హాస్టళ్లలోకి అనుమతించరాదని ఆదేశించారు. వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య సి. సుజాత ఉన్నారు.