మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఇదివరకే జోగిరమేష్ పోలీసుల విచారణను ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి విచారణకు రావాల్సి ఉండగా.. జోగి రమేష్ గైర్హాజరయ్యారు. మాజీమంత్రి తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. జోగి రమేష్ విచారణ రావడం లేదని లాయర్లు స్పష్టం చేశారు. కాగా... చంద్రబాబుపై ఇంటిపై దాడి కేసులో జోగిరమేష్‌కు పోలీసులు ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేశారు. జోగిరమేష్ సహా మరికొందరికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేత పోలీసుల విచారణకు హాజుకావాల్సి ఉంది. అయితే మాజీ మంత్రి విచారణకు హాజరుకావడం లేదని జోగిరమేష్ తరపు న్యాయవాదులు పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణను ఓపెన్ చేసిన పోలీసులు గత శుక్రవారం జోగి రమేష్‌ను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో గంటన్నర పాటు విచారణ చేశారు. ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం జోగిని పోలీసులు ఇంటికి పంపించివేశారు. అయితే ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా జోగిరమేష్‌తో మరికొందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.