ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. హోంశాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరుపుతారు. ఆస్పత్రులలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరుపుతారు. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో ఇసుక పాలసీ అమలు, ఇసుక లభ్యత, ఇసుక రవాణ ఛార్జీల నియంత్రణపై సీఎం చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. రవాణ శాఖపైనా ఆయన సమీక్షిస్తారు. అదనంగా 2 వేల బస్సులు, 3,500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చలు జరిపుతారు. రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.