కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో బాగంగా 1973 నాటి అరుణా షాన్బాగ్ ఉదంతాన్ని ఉదహరించింది. మహిళా వైద్యులపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని సుప్రీం పేర్కొంది.
ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ అసుపత్రిలో నర్సు అయిన షాన్బాగ్ పై వార్డ్ అటెండెంట్ లైంగిక దాడి చేశాడు. ఈ దాడితో ఆమె మంచానికే పరిమితమై 42 ఏళ్లు జీవచ్ఛవంలా గడిపింది. 2015లో కన్నుమూసింది. నిందితుడు 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.