ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలన చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కోరారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చేపట్టిన భారత్ బంద్ విజయవంతం చేసిన అందరికీ వీరు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ప్రధాన రహదారులపై బైఠాయించి నినాదాలు చేశారు.