దుర్గి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో మోదేపల్లి, రజానగరం మేజర్ల కింద ఆయకట్టు పరిధిలోని భూములకు సాగర్ జలాలు విడుదల చేయించాలని నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మిని బుధవారం మండలంలోని పోలవరం గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు కోరారు. రెండు మేజర్ల పరిధిలో వరి సాగు చేసేందుకు నారుమళ్లు పోశారని, ప్రస్తుతం నీటి ఎద్దడితో అవి ఎండి పోతున్నాయని, కనీసం సాగర్ జలాలను విడుదల చేస్తే మేలు ఉంటుందని తెలిపారు. పై పెచ్చు వాగులు, చెరువుల్లో చుక్క నీరు లేక ఎండిపోవటం వల్ల సమీపంలోని వ్యవసాయ బోర్లు ఎండిపోవటం వల్ల రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు. వెంటనే స్పందించిన ఇన్‌చార్జ్ లక్ష్మి సంబంధిత ఎన్‌ఎ్‌సపీ ఎస్‌ఈ పాటు ఈఈలతో ఫోన్‌లో మాట్లాడారు. కనీసం చిలకలేరు, దోర్నపువాగులకు చెరువులకు నీరు నింపాలని ఆమె సూచించారు. దీంతో అధికారులకు ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి వెంకట స్వామి, కాసా అంజిరెడ్డి, గూడాల శివ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.