ఋషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ బుధవారం విశాఖపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ అవార్డు వచ్చిందన్నారు. ఈ బీచ్‌ను మరింతగా అభివృద్ధి పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సినిమా రంగానికి మంచి అవకాశాలున్నాయన్నారు. అత్యధిక సినిమా షూటింగులు విశాఖలోని జరుగుతున్నాయని గుర్తు చేశారు. సినీ రంగానికి చెందిన ఒక బృందం త్వరలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సినీరంగం అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలోనే విశాఖలో పర్యటిస్తారని చెప్పారు.