అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.