ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలంలోని గోపాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోగల అగ్రహారం భూములు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలను అందజేస్తామని ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి తెలిపారు. సంతమాగులూరు మండలంలోని గోపాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని భూములను బుధవారం ఆర్డీవో పరిశీలించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవిబాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.