సెప్టెంబర్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినిగియోంచుకోవాలని న్యాయాధికారులు కె.ప్రశాంతి, బి.శాంతి అన్నారు. బుధవారం కోర్టు భవనాల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ జరిగేలా కక్ష్యదారులకు తెలియజేయాలన్నారు. రాజీపడిన కేసులకు సంబంధించిన అవార్డు కాపీలను ఇరువర్గాల సంతకాలతో పొందవచ్చన్నారు. ఈ కేసులకు ఎలాంటి అప్పీలు ఉండదన్నారు. లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అన్నవిషయాన్ని కక్ష్యదారులకు తెలియజేయాలని న్యాయవాదులకు సూచించారు. కక్ష్యలు కార్పణ్యాలకు పోయి జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దని ప్రశాంతి, శాంతి సూచించారు.