పంచాయతీ సంస్కరణలు కొనసాగింపులో భాగంగా ఈ నెల 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది. భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయతీలకు ఉండే అధికారాలను గ్రామాల అభివృద్ధికి ఉపయేపడేలా చేసి... పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.