నేపాల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాల్ దేశంలోని మర్య్సంగ్డి నదిలో పడిపోయింది ఓ ప్రైవేట్ బస్సు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు.నేపాల్ లోని తనహున్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఈ ప్రమాదం 10 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారతీయ బస్సు శుక్రవారం మర్స్యంగ్డి నదిలో పడటంతో కనీసం 10 మంది ప్రయాణికులు మరణించారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. భారతీయ రిజిస్టర్డ్ బస్సులో కనీసం 40 మంది ప్రయాణికులు ఉన్నారని, ఉదయం 11.30 గంటలకు అది నదిలో పడిపోయిందని నివేదికలు తెలిపాయి.“యుపి ఎఫ్‌టి 7623″ అనే నంబర్ ప్లేట్ గల బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉంది” అని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ నుండి డిఎస్‌పి దీప్‌కుమార్ రాయా తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) మాధవ్ పౌడెల్ నేతృత్వంలో 45 మంది సాయుధ పోలీసు బలగాల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.