త్వరలో కొత్త ఇసుక విధానం రానున్నదని, ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈనెల 23 శుక్రవారం నుంచి ప్రత్యేకంగా ఇసుక బుకింగ్‌కు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం నూతన మార్గదర్శకాలపై జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డీసీపీ కేఎం మహేశ్వరరాజు, ఏసీపీ రవికిరణ్‌తో కలిసి గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.