ఉయ్యూరు పరిధిలోని పెద ఓగిరాలలో గురువారం పాముకాటుతో కౌలురైతు మృతి చెందాడు. చిన ఓగిరాలకు చెందిన కందుకూరి రాజు(35) పెద ఓగిరాలకు చెందిన బొమ్మారెడ్డి నాగేశ్వరరెడ్డికి చెం దిన రెండెకరాల మెట్టపొలం కౌలుకు తీసుకుని పసుపు, క్యాబేజీ పండిస్తున్నాడు. ఉదయం పంటకు నీరుపెట్టేందుకు పొలానికి వెళ్లి అక్కడ ఉన్న ప్లాస్టిక్ ట్యూబ్ మడత విప్పుతుండగా అందులో ఉన్న పాముకాటు వేసింది. వెంటనే అతనిని పొరుగున ఉన్నవారు ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. చికిత్సపొందుతూ అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.