ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించానరు. వైద్య సౌకర్యాలు, రికార్డులు, మందుల లభ్యత పరిశీలించారు రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి వాకబు చేశారు.అనంతరం కలెక్టరేట్లో డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను. ఆస్పత్రి సమస్యల పరిష్కారం, మెరుగైన వైద్య సేవల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి డాక్టర్ల అభిప్రాయం తెలుసుకున్నారు.గిరిజన ప్రాంతం కాబట్టి వైద్య సేవల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చాలని డాక్టర్లకు సూచించాను. ఆస్పత్రి ప్రాంగణాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించాను. ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు.రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపరచడం కోసం రూపొందించిన 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక గురించి డాక్టర్లకు వివరించాను. దీన్ని అమలు చేసే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరాను. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్సాధనలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.