మహిళలపై పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు సెంటాన్స్ డిగ్రీ కాలేజీలో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం సెమినార్ నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ కోల్‌కత్తా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం దారుణమన్నారు. చట్టం తీసుకొచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా కఠినమైన చట్టాలు అమాలు చేయాలన్నారు. వైద్యులకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తుమందులను ప్రభుత్వం ఆరికట్టాలని డిమాండ్ చేశారు. ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు హైమావతి, శ్యామలరాణి, శారధ, హరీషదుర్గా, లెనిన్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి పాల్గొన్నారు.