‘మన పంచాయతీ... మన సాధికారత’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో నేడు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఊరు బాగు కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ కోసం 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు 38 రకాలు చేపట్టేందుకు ఈ సభల్లో తీర్మానాలు చేస్తారు. మొత్తం 87 రకాల పనులు, వేతనాలకు రూ.4,500 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 9 కోట్ల పనిదినాలు, 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది.