ఏపీని అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోయారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆరోపించారు. వీరవాసరంలో గ్రామ సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. సీఎం కుర్చీని కూడా అమ్మేసి, 30 సంవత్సరాలు తాకెట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పనికి రాకుండానే వచ్చినట్లు హాజరు వేయించుకున్నారని ఆరోపించారు. అది నేరం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎన్ఆర్జీఎస్ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాలని పులపర్తి రామాంజనేయులు అన్నారు.