ఏలూరు తంగెళ్లమూడిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రీసైక్లింగ్ సిస్టమ్ ట్రైల్ రన్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అమృత్ పథకంపై రీసైక్లింగ్ ప్రాజెక్ట్‌కు 2018లో టీడీపీ ప్రభుత్వం సుమారు రూ. 38 కోట్లు కేటాయించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పనులను ఎక్కడికక్కడే నిలిపివేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను పునః ప్రారంభించిందని చెప్పారు. ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురికి కాల్వల్లో నీటిని శుద్ధిచేసి..ఆ నీటిని వ్యవసాయానికి పలు అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ రీసైక్లింగ్ సిస్టం మూడు నెలల్లో పూర్తిస్థాయి అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.