కర్ణాటకలోని శివమొగ్గలో వైద్యులు తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మిల్లులో పని చేసే ఓ కార్మికుడు (35) చేయి రంపంలోకి వెళ్లిపోయింది. బాధితుడి చేయి రెండు ముక్కలు అయింది. వెంటనే బాధితుడిని, తెగిన ఆయన చేతిని తోటి కార్మికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు 7 గంటల పాటు ఆపరేషన్ చేశారు. తెగిపోయిన చేయిని బాధితుడి చేతికి అతికించారు. త్వరలోనే అతడి చేయి ఇంతకు ముందులా పని చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు.