కోల్కతా డాక్టర్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. డాక్టర్ హత్యకు గురైన ఆస్పత్రిలోని సెమినార్ హాల్ తలుపు బోల్ట్ (గొళ్ళెం) విరిగిపోయిందని, దాంతో ఆమె తాళం వేయలేదని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. డోర్ పనిచేయని విషయం అందరికీ తెలిసిందేనని, ఆ రోజు డోర్ లాక్ పనిచేసుంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదని డాక్టర్లు, ఇంటర్న్ లు తెలిపారు. ఈ దాడి సమయంలో నిందితుడు డోర్ వద్ద ఎవరినైనా కాపలాగా ఉంచాడా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది.