విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొమరాడ మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటిపాం రోడ్డు వంతెన పై నుండి బైక్ పై వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ వంతెన పై నుండి కిందికి బైక్‌తో సహా పడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి పార్వతీపురానికి చెందిన శేషారెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa