కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం మచిలీపట్నం ఈడేపల్లి వేడుక ఫంక్షన్ హాలు ప్రాంగణంలో ఉద యం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించే కృష్ణాష్టమి వేడుకల్లో కృష్ణ భక్తులందరూ పాల్గొనాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. శనివారం తన కార్యాల యం వద్ద కృష్ణాష్టమి వేడుకల ఆహ్వాన పత్రికలను ఆయన ఆవి ష్కరించారు. వాసుదేవ గోశాల, మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు గో పూజ, 9 గంటల నుంచి 11 గంటల వరకు హరినామ సంకీర్తన, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు వేదపారాయణ, 4 గంటల నుంచి 6 గంటల వరకు కోలాట ప్రదర్శన, 6 గంటల నుంచి 6.30 గంటల వరకు కృష్ణుని పూజ, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు విద్యార్ధులతో రాధాకృష్ణుల వేషధారణ పోటీ లు, 7.30 గంటల నుంచి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర అధికా రులు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉట్టి కొట్టే కార్య క్రమంలో యువతీ యువకులు పాల్గొనాలని కొనకళ్ల పిలుపుని చ్చారు. పల్లపాటి అభినవ్, పి.వి. ఫణికుమార్ తదిత రులు పాల్గొన్నారు.