రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు మేలైన సేవలందించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, వివిధ శాఖల రెవెన్యూ అధికారులతో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు, స్వచ్ఛ ఆఫీస్ రికార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, అసైన్డ్, ల్యాండ్స్, పట్టా లాండ్స్, ఓల్డ్ ల్యాండ్స్, ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. మీ కోసం పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదులను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి రికార్డులను సిద్ధం చేసి ఈ నెల 28లోగా సమర్పించాలన్నారు. కోర్టు కేసులపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించా లని, ఈ పనిని కిందిస్థాయి సిబ్బందికి అప్పగించవద్దని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూట్ కలెక్టర్, తాడేపల్లిగూడెం ఇంచార్జి ఆర్డీవో బి.శివన్నా రాయణరెడ్డి, నరసాపురం ఆర్డీవో ఎం.అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు.