ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో సెప్టెంబరు 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆదేశాల మేరకు జిల్లా జడ్జీలు, ఎస్పీ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రభుత్వ న్యాయవాదులు, జిల్లా కారా గార సూపరింటెండెంట్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సమ న్వయ సమావేశం నిర్వహించామన్నారు. కేసులను త్వరితగతిన విచారించడానికి ఉన్న వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపైన చర్చించినట్టు తెలి పారు. సాక్ష్యులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు, వారు పనిచేసే స్థానాలను గుర్తించి సమన్లు అమలు చేయడం ద్వారా కేసుల పరిష్కారాన్ని ముందుకు తీసుకు వెళ్ళవచ్చని తెలిపారు. ఖైదీలను ఆన్‌లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, సమన్లను ఎన్‌స్టెప్ ద్వారా అమలు చేయడం వల్ల త్వరితగతిన కేసులను పరిష్కరించ వచ్చు నని సూచించారు. జిల్లా ఎస్పీ కిషోర్ మాట్లాడుతూ కేసుల విచారణకు పోలీసు వ్యవస్థ సహకరిస్తుందన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణారెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండవ అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి, 8వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, ఏలూరు బార్ అధ్యక్షుడు, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారామ్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మణరెడ్డి, ప్రభుత్వ న్యాయ వాది బీజే రెడ్డి, జిల్లా కారాగార సూపరింటెండెంట్ స్వామి పాల్గొన్నారు.