హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో 15రోజులుగా వీధి దీపాలు వెలుగకపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో ఆ ప్రాంత జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మార్లు మునిసిపల్ అధికారులకు స్థానిక కౌన్సిలర్ మహాలక్ష్మి విన్నవిం చినా ఫలితం లేదు. రాత్రిపూట బయటికి వెళ్లాలంటే స్థానికులు జంకు తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చీకటి పడితే బయటికి వె ళ్లడానికి ఇబ్బందిగా మారింది. సొంత డబ్బుతో ఏర్పాటు చేసుకుంటా మని కోరినా మునిసిపల్ అధికారులు పట్టించుకోలేదని కౌన్సిలర్ ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్‌తో పాటు ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.