ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది 100శాతం కరెక్టే.. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతపై జనసేన నేత ఆసక్తికర ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 08:45 PM

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేత అంశం చర్చనీయాంశమైంది. హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కావడంతో అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నది లేదా చెరువు జోన్‌లోకి మన చొరబాటు వల్లే పట్టణాలలో వరదలు వస్తున్నాయి.. 100% కరెక్ట్' అన్నారు. హైదరాబాద్ వరదలకు గురికాకూడదని.. అందుకే చెరువులో, దాని బఫర్ జోన్ లో కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం సరైనదే అన్నారు. 'నేను పట్టా భూమిలోనే నిర్మాణం చేసాను దీనిపై కోర్టులో కేసు ఉంది, కూల్చివేతపై స్టే కూడా ఉంది నా కన్వెన్షన్ సెంటర్ కూల్చడం తప్పు.. కరక్టే' అన్నారు.


'ఇదెలా సాధ్యం?.. ఎలా అంటే అధికారుల అలసత్వం వల్ల, నదీ లేదా చెరువుల పరివహక ప్రాంతాన్ని ప్రజలకు తెలిసే విధంగా డీమార్క చేయక పోవడంవల్ల కొందరు దిగువ స్థాయి రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పరీవాహక ప్రాంత ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూములుగా, పట్టా భూములుగా చూపుతున్నారు.. నిజానికి మనకి పట్టా వున్నా అది చెరువు లేదా నదీ పరీవాహక ప్రాంతానికి చెందినది అయితే అక్కడ కేవలం సేంద్రీయ వ్యవసాయం మాత్రమే చేయాలి.. ఏటువంటి నిర్మాణాలు చెయ్య కూడదు' అంటూ ట్వీట్ చేశారు. 2015లో NGT ఆర్డర్‌పై MH ప్రభుత్వం 2017లో చేసింది.. ఇది అన్ని రాష్ట్రాలచే చేయబడుతుంది'అన్నారు.


సత్యనారాయణ మరో ట్వీట్ కూడా చేశారు. 'సహజ వనరుల రక్షణ, వాటి నిర్వహణ రాజ్యాంగంలో ఆర్టికల్ 48a ప్రకారం ప్రభుత్వ భాధ్యత, అలాగే ఆర్టికల్ 51 A(h) ప్రకారం మన భాధ్యత కూడా.. ఇప్పుడు సహజ వనరుల రక్షణ మరియు విపత్తుల నుండి రక్షణ కోసం తెలంగాణా ప్రభుత్వం GO 99/19.07.2024 తీసుకువచ్చి దాని అమలుకు హైదారాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) స్థాపించి హైదరాబాద్ లో చెరువులను ఆక్రమణలను తొలగించడంపై వస్తున్న భిన్న కథనాలు చూసాక.. నా అభిప్రాయం ప్రజల ముందు ఉంచుతున్నాను' అంటూ వీడియోను జత చేశారు.


'సహజ వనరుల రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి.. ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ప్రతిఒక్కరూ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మద్దత్తు తెలపాలి. అలాగే ఈ రోజు వార్తల్లో రాష్ట్రంలో 38,000 చెరువులకు మహర్ధశ అని వార్త చూసి ఆనందం కలిగింది.. ఆంధ్రాలో కూడా హైడ్రా వంటి చట్టం తీసుకువచ్చి ఒక్క ఏడాదిలో అన్ని చెరువులను ఆక్రమణల నుండి కాపాడాలి. ఇది రాష్ట్రంలో కరువు మరియు వరదల విపత్తుల నివారణకు తోడ్పడుతుంది' అన్నారు.


'చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా కృషి అభినందనీయమే అయితే దాని అమలులో ప్రభుత్వ చిత్త శుద్ధి చివరివరకూ ఉండాలి. నిన్న తుమ్మిడికుంట చెరువుపై పెట్టిన దృష్టే హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, గండిపేట, దుర్గం, అమీనాపూర్, జీడిమెట్ల, మంత్రాల, కొత్త, ఐడీపీఎల్, హస్మత్‌పుర, బాలాజీనగర్, కౌకూర్, సూరారం, లింగం, వెన్నెలగడ్డ, ప్రగతినగర్, కాప్రా, కీసర, పూడురు, ఎల్లమ్మపేట, మేకంపూర్, నల్ల, కాటేదాన్ దగ్గర పల్లె చెరువుల వంటి 184 పెద్ద చెరువులు దాదాపు మూడు వేలకు పైగా ఉన్న చెరువులను కాపాడాలి' అని పిలుపునిచ్చారు.


'మనకి పట్టా భూములు ఉన్నా అవి నదీ పరివాహక లేదా చేరువు పరివాహక ప్రాంతాలలో ఉంటే అక్కడ నిర్మాణాలు చెపట్టకూడదు సహజ వనరులకు రాజ్యాంగ రక్షణ ఉంది.. అక్కడ నిర్మాణాలు కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాదు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయి.. అక్కడ తాత్కాలికంగా ప్రభుత్వ అండతో నిర్మాణాలు కట్టినా అవి తర్వాత కూల్చివేయబడతాయి.. హైదారాబాద్ నగరానికి నీరు అందిస్తున్న హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ల పరీవాహక ప్రాంత రక్షణ కోసం అక్కడ కేవలం 10% భూమిలో నిర్మాణాలకు, 90% భూమిని కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగచాలని అప్పటి ప్రభత్వం GO 111 జారీ చేసింది.. కానీ కెసిఆర్ ప్రభుత్వం దానిని కొట్టి పారేస్తూ GO 69 జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఆ GO 69 జోలికి పోలేదు అలాగే GO 111 పునరుద్ధరించ లేదు' అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com