నేడు జరిగిన డా. పీవీజీ రాజు శతజయంతి సందర్భంగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు మాట్లాడుతూ.. పీవీజీ అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు అశోక్ గజపతిరాజు నడిచారని మెచ్చుకున్నారు. సామాన్యమైన జీవితం గడపడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పదవీ ప్రమాణ స్వీకారంలో చేసిన ప్రమాణాలకు కట్టుబడి, తూ.చ.తప్పకుండా నిబంధనలు పాటించే ఏకైక వ్యక్తి అశోక్ గజపతి రాజు అని అన్నారు. తండ్రి పీవీజీ అడుగుల్లో నడుస్తున్న అశోక్ గజపతి జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యావకాశాలు పెంచడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహద పడుతుందని అన్నారు. ఇక రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పీవీజీ ఔదార్యం భవిష్యత్ తరానికి తెలియాలని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలకులు విద్యావ్యవస్థనే కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా సర్వనాశనం చేశారని అన్నారు. నేటి తరంతో పాటు భావితరాల బాగు కోసమే మాన్సా స్ సంస్థ పనిచేస్తోందని ప్రశంసించారు.