భవానిపురంలోని రోజ్ గార్డెన్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ ను స్థానిక ఎన్డీయే నాయకులతో కలిసి ప్రారంభించాను. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్కులో నా చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది, శిక్షణ పొందిన కోచ్ ల పర్యవేక్షణలో బాల బాలికలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తారని, స్థానిక క్రీడాకారులు స్కేటింగ్ రింక్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపాను. నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేసి క్రీడాకారులను తయారు చేస్తాము. పేద, మధ్యతరగతి క్రీడాకారుల సాధనకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఇండోర్ స్టేడియాల నిర్మాణాలను చేపట్టి క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తాము. అనంతరం 2023 చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన కైవల్య, చైత్ర దీపిక లను అభినందించాను.అంతేకాకుండా హెచ్ బి కాలనీ అబ్దుల్ కలాం పార్క్ లో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ను ప్రారంభించాను. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకుండా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపాను. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయస్థాయిలో పతకాలను సాధిస్తారని తెలిపాను.