యూపీలోని రాయ్‌బరేలీలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. NTPCకి చెందిన ఉంచహార్ ప్రాజెక్ట్ ప్లాంట్ ప్రాంతంలో గూడ్స్ రైలు బొగ్గు అన్‌లోడ్ చేసేందుకు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో దానికి ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజిన్ వచ్చింది. వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలింజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa