ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన జరిగిన 8 గంటలలోనే నిందితుడిని అరెస్టు చేశారు.
అరెస్టుకు ముందు నిందితుడు తనని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్ లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa