ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ఆమె తన ఫోన్లు ఫార్మాట్ చేసి ఆధారాలను చెరిపివేసిందన్న ప్రాసిక్యూషన్ వాదనలపై ప్రశ్నలు సంధించింది. "మెసేజ్‌లను అందరూ డిలీట్ చేస్తారు. గ్రూప్ మెసేజ్ లను డిలీట్ చేసే అలవాటు నాకూ ఉంది" అని జస్టిస్ కేవీ విశ్వనాథన్ చెప్పారు. ఫోన్ అనేది వ్యక్తిగత అంశమని, ఫోన్ ఫార్మాట్ చేస్తే నేరం చేసినట్టు భావించకూడదని అన్నారు.