తమిళనాడులోని అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు సూపర్ మార్కెట్లలో విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. జీడిపప్పు, బాదం ప్యాకెట్లు, హార్లిక్స్, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను వారు దుస్తుల్లో పెట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సూపర్ మార్కెట్ యజమాని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.