ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం కన్నా ముందే పింఛను అందుతుండడం పట్ల లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ ను ఈ నెల చివరి రోజు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పింఛన్ పంపిణీకి సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. సెప్టెంబర్ 1వ తేదీనాడు ఆదివారం సెలవుదినం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుంది. లబ్ధిదారులకు పింఛను ఠంచనుగా అందించేందుకు కూటమి సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.31వ తేదీన పింఛన్ అందకపోతే సెప్టెంబర్ 2న అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవంతంగా రెండు సార్లు పింఛన్ పూర్తి చేయగా మూడో పింఛన్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, అధికారులతో పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.