తెలుగు పదాలు అచ్చులతో ముగుస్తాయి. ఇవి వాటిని మృదువుగా, శ్రవణానందకరంగా పలికేలా చేస్తాయి. ఈ లక్షణం ఇటాలియన్ భాషలోనూ ఉంటుంది. 15వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన సమయంలో ఈ రెండు భాషల మధ్య సారూప్యతను గుర్తించి, తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని కొనియాడారని చరిత్ర చెబుతోంది.