క్షేత్రస్థాయిలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం పరిధిలోని బైదలాపురం పీహెచ్‌సీ, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను ఆయన బుధ వారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై బోధన, మెనూ తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. బైదలాపురం పీహెచ్‌సీలో అందిస్తున్న సేవలు, ప్రసవాలు తదితర అంశాలపై వైద్యాధికారి సదాశివను ప్రశ్నించారు. వైద్యురాలుసత్యవాణి దీర్ఘకాలంగా విధులకు హాజరు కావడంలేదంటూ స్థానిక గిరిజనులు ఆయనకు ఫిర్యాదు చేశారు. నల్లబొంతు గిరిజన గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మౌలిక వసతులతో పాటు శ్మశాన వాటిక లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. అలాగే పాఠశాల ఓ ప్రైవేటు గృహంలో నిర్వహిస్తు న్నారని స్థానికులు పేర్కొనగా ఈ విషయాలన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వడిత్య శంకర్ నాయక్ తెలిపారు. కార్య క్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి, స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.