శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా మూడు ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. దేశ వ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్‌ఎం సేవలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివరగం ఆమోదించింది. మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను పెంచడమేకాకుండా, కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు వీలు కల్పించింది. రూ.784.87 కోట్ల నిధులతో ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో ఫేజ్ ఇల్ పాలసీ కింద 234 కొత్త నగరాలు, పట్టణాల్లో 730 చానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ-వేలంకు ప్రతిపాదనలు చేయగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. త్వరలో మూడు ఎఫ్‌ఎం స్టేషన్లు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి.