వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే నేను జైలుకు వెళ్లాను. వైఎస్సార్‌కు, వైఎస్ జగన్‌కు చాలా తేడా ఉంది. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక నేతగానే ఉండాలని నేను కోరుకున్నాను. వైఎస్ జగన్ రెడ్డే నన్ను రాజ్యసభకు పంపారు. నా రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయి. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మధ్యాహ్నం 12:30 గంటలకు కు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా చేస్తాను. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను..? ఏమిటనేది..? వైసీపీ నేతలే ఆలోచించాలి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం నాది కాదు’ అని మోపిదేవి చెప్పుకొచ్చారు.